Wednesday, 29 July 2026 08:23:53 AM

చలిలో ఫుట్ పాత్ పై నిద్రిస్తున్న పేదవారికి దుప్పట్లు పంపిణీ చేసిన జనసేన వీర మహిళ వెంకటలక్ష్మి

Date : 28 January 2025 08:56 PM Views : 452

ఆకాంక్ష న్యూస్ - ఆంధ్ర ప్రదేశ్ / పిఠాపురం : పిఠాపురం పట్టణంలో జనసేన వీర మహిళ బొలిశెట్టి వెంకటలక్ష్మి తమ వంతు సహాయం అందించే దిశగా చలికి వణుకుతు నిరాశ్రయులుగా బిక్షాటన చేసే వ్యక్తులకు దుప్పట్లు పంపిణీ చేసే కార్యక్రమం నిర్వహించి 50 మందికి దుప్పట్లు అందజేయడం జరిగింది. ఈ సందర్భంలో భాగంగా బొలిశెట్టి వెంకటలక్ష్మి మాట్లాడుతూ పిఠాపురం ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సేవా స్ఫూర్తితో అనేక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. అలానే తనను ఎల్లప్పుడూ ప్రోత్సహించే పిఠాపురం జనసేన పార్టీ ఇంచార్జ్ మారెడ్డి శ్రీనివాస్ కి మరియు పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు. ఈ కార్యక్రమాన్ని చేయడం తమకు ఆనందంగా ఉందని, ఈ చిన్న సహాయక ప్రయత్నం అందరూ ఆదరిస్తారని కోరుకుంటూ రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేస్తామని పేర్కొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :