Tuesday, 28 July 2026 08:09:43 AM

అమ్మను గెంటేసిన వాడికి అంగన్‌వాడీల విలువ ఏం తెలుస్తుంది...

అంగన్వాడీలపై సమ్మెపై ఎస్మా ప్రయోగించడాన్ని తప్పుబట్టిన నారా లోకేష్‌

Date : 06 January 2024 04:43 PM Views : 375

ఆకాంక్ష న్యూస్ - ఆంధ్ర ప్రదేశ్ / అమరావతి : డిమాండ్లు పరిష్కారించాలని గత 26 రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీలపై సమ్మెపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఎస్మా ప్రయోగించడాన్ని టీడీపీ జాతీయకార్యదర్శి నారా లోకేష్‌మండిపడ్డారు. అంగన్‌వాడీలు శాంతియుతంగా ఆందోళన చేయడం కూడా ఒక నేరమా అంటూ జగన్‌ ప్రభుత్వాన్నిప్రశ్నించారు. ‘అమ్మనే గెంటేసిన వాడికి అంగన్‌వాడీల విలువ ఏం తెలుస్తుందని’ అన్నారు. అంగన్‌వాడీ వేతనాల్లో కోత విధించడం నియంత పోకడలకు నిదర్శనమని దుయ్యబట్టారు. అంగన్‌వాడీల సమ్మెను నిషేదిస్తూ తీసుకొచ్చిన జీవో 2ను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. అంగన్‌వాడీల ఉద్యమానికి టీడీపీ సంపూర్ణ మద్దతు ఉంటుందని వెల్లడించారు. జగన్‌ అహంకారానికి, అంగన్‌వాడీల ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న ఉద్యమంలో అంతిమ విజయం అంగన్‌వాడీలదేనని అన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :