Friday, 12 June 2026 01:33:19 AM

చంద్రబాబు నాయుడుకు ఏపీ హైకోర్టు లో భారీ ఊరట

ఒకేసారి మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు

Date : 10 January 2024 03:56 PM Views : 266

ఆకాంక్ష న్యూస్ - ఆంధ్ర ప్రదేశ్ / అమరావతి : తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కు ఏపీ హైకోర్టు లో భారీ ఊరట లభించింది. బుధవారం నాడు హైకోర్టులో చంద్రబాబుపై ఉన్న మూడు కేసులపై విచారణ జరిగింది. ఈ విచారణలో హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఒకేసారి మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.IRR, మద్యం, ఉచిత ఇసుక కేసులల్లో ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అలాగే మద్యం కేసులో నిందితులుగా ఉన్న మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, విశ్రాంత ఐఏఎస్ అధికారి శ్రీ నరేష్‌కు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. చంద్రబాబు తరపున సీనియర్ కౌన్సిల్స్ సిద్ధార్థ లూథ్ర.. దమ్మాలపాటి శ్రీనివాస్, పోసాని వెంకటేశ్వర్లు హైకోర్టులో వాదనలు వినిపించారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :