Sunday, 26 April 2026 04:35:17 PM

నిజాయితీ వార్తలే లక్ష్యం...

– బెదిరింపులకు లొంగేది లేదు...

Date : 25 February 2026 09:51 PM Views : 181

ఆకాంక్ష న్యూస్ - ఆకాంక్ష డెస్క్ / : నిజాయితీగా వార్తలు రాయడమే తన లక్ష్యమని, ఎవరిని ఉద్దేశించి లేదా ఎవరికి అనుకూలంగా వార్తలు రాయడం తన వృత్తి ధర్మం కాదని జర్నలిస్టు పెనగొండ సతీష్ స్పష్టం చేశారు. ఇటీవల తన గురించి విచారణలు జరుపుతున్నారనే సమాచారం నేపథ్యంలో ఆయన స్పందించారు.“నేను ఎక్కడ దొరుకుతానా అని విచారణ చేయడం కన్నా, ఉన్న సమస్యలను సరిదిద్దుకోవడం ముఖ్యం నిజాలను వెలుగులోకి తేవడం మీడియా బాధ్యత అని, ఆ బాధ్యత నుంచి తాను వెనక్కి తగ్గబోనని అన్నారు. “నీ కోసమో, ఇంకెవరి కోసమో నేను వార్తలు రాయడం మానను. ప్రజా ప్రయోజనమే నా ధ్యేయం, నా పై ఒత్తిళ్లు,బెదిరింపులు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నా, వాటికి తాను భయపడను.కేసులో కేసు మరో అక్రమ కేసు నాపై నమోదు చేయడం తప్ప మీకు వేరే ఏది కూడా ఆధారం లేదు...నీ తాటాకు చప్పుళ్లకు పెనగొండ సతీష్ భయపడడు. గత 14 ఏళ్లుగా నీలాంటి అధికారులను ఎంతో మందిని చూశాను.సమస్యలను పరిష్కరించుకోవడం ద్వారా వివాదాలకు ముగింపు పలకవచ్చని, లేదంటే ఎక్కడికి వెళ్లినా ఇలాంటి వివాదాలు వెంటాడుతూనే ఉంటాయి. ఇప్పటికైనా వ్యక్తిగతంగా ఇలాంటి చర్యలు తీసుకోవాలనే ఆలోచన మానుకొని, ప్రజల సమస్యల పరిష్కారంపై దృష్టి సారిస్తే బాగుంటుంది. ప్రజల విశ్వాసమే నా బలం అని, ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోవడమే తన కర్తవ్యం, నిజాయితీతో కూడిన పాత్రికేయ ధర్మాన్ని కొనసాగిస్తానని, ఎలాంటి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు...

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :