Friday, 12 June 2026 01:41:39 AM

డీజిల్ వ్యవహారంలో ఓ కానిస్టేబుల్ చేతివాటం....❓

స్థానికంగా ఉండే కొందరి పెట్రోల్ బాంకు యజమానులకు వార్నింగ్... ❓ ఓ రూరల్ పోలీస్ స్టేషన్ లో చర్చనీయాంశంగా మారుతున్న కానిస్టేబుల్ వ్యవహారం...

Date : 21 August 2025 12:59 PM Views : 917

ఆకాంక్ష న్యూస్ - ఆకాంక్ష డెస్క్ / : రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఓ రూరల్ పోలీస్ స్టేషన్‌లో ప్రస్తుతం ఓ కానిస్టేబుల్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళ్తే...ఇటీవల డీజిల్ సరఫరా చేసే కొంత మందితో ఆ కానిస్టేబుల్ చేతివాటం ప్రదర్శించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీస్ వాహనాల కోసం కేటాయించిన డీజిల్ సరఫరాలో అతడు అనుచిత పద్ధతులు అవలంబిస్తున్నాడనే వార్తలు గుసగుసలుగా వినిపిస్తున్నాయి. డ్యూటీ పేరుతో కొంత భాగాన్ని స్వప్రయోజనాలకు వాడుకోవడం, అలాగే పెట్రోల్ బంక్ యజమానులను ఇబ్బంది పెట్టడం వంటి చర్యలు చోటు చేసుకున్నాయనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే కొందరు పెట్రోల్ బంక్ యజమానులకు ఆ కానిస్టేబుల్ వార్నింగ్‌ ఇచ్చినట్లు ప్రచారం సాగుతుంది.గతంలో కూడా ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఈ కానిస్టేబుల్ వివాదాస్పద పాత్ర పోషించిన సంఘటనలు ఉన్నాయి. రాజకీయ వర్గానికి చెందిన. ఓ నిర్దిష్ట పార్టీ తరఫున వారికీ మద్దతుగా వ్యవహరించడం వంటివి అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలకు దారి తీసింది. అయినప్పటికీ, అప్పటి నుంచి ఇప్పటివరకు అతడిపై ఎటువంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోకపోవడం విశేషంగా మారింది.ఇప్పుడు డీజిల్ వ్యవహారం కొత్త కలకలానికి దారి తీసింది. స్థానిక పెట్రోల్ బంక్ యజమానులు కూడా అధికారుల దృష్టికి ఇది తీసుకెళ్లాలా వద్దా అన్న సందిగ్ధంలో ఉన్నాట్లు తెలుస్తోంది. మొత్తం మీద, ఓ కానిస్టేబుల్ వ్యవహారం కమిషనరేట్ స్థాయిలోనే చర్చనీయాంశంగా మారింది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :