Tuesday, 28 July 2026 12:25:28 PM

పహల్గాం ఉగ్రదాడి ఆపరేషన్‌ సిందూర్‌పై చర్చకు విపక్షాల పట్టు..

సభలో పెద్ద ఎత్తున నినాదాలు..సభ వాయిదా

Date : 21 July 2025 07:46 PM Views : 418

ఆకాంక్ష న్యూస్ - ఆకాంక్ష డెస్క్ / : పహల్గాం ఉగ్రదాడి ఘటన పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల ను కుదిపేస్తోంది. ఈ ఘటనపై చర్చించాలంటూ విపక్షాలు లోక్‌సభలో నిరసనకు దిగారు. దీంతో దిగువ సభలో గందరగోళం నెలకొంది. స్పీకర్‌ ఎంత చెప్పినా సభ్యులు వినకపోవడంతో లోక్‌సభ ను వాయిదా వేయాల్సి వచ్చింది. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు సోమవారం ఉదయం 11 గంటలకు ఉభయసభలు సమావేశామయ్యాయి. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత మొదటిసారిగా ఉభయ సభలు సమావేశమయ్యాయి. విపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు పలు వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టారు. పహల్గాం ఉగ్రదాడి ఆపరేషన్‌ సిందూర్‌పై చర్చించాలంటూ పట్టుబట్టారు. అయితే, ప్రశ్నోత్తరాల తర్వాత వాయిదా తీర్మానాలపై చర్చ చేపడదామని స్పీకర్‌ ఓంబిర్లా నచ్చజెప్పారు. అయినా ఎంపీలు వినిపించుకోలేదు. సభలో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. విపక్షాల నిరసనల మధ్యే లోక్‌సభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :