Tuesday, 28 July 2026 04:03:36 AM

పేద కుటుంబ వివాహానికి వెస్సో ట్రస్ట్ ఆర్దిక సహాయం..

Date : 26 February 2025 06:33 AM Views : 722

ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / నల్లగొండ జిల్లా : నల్గొండ జిల్లా, వేములపల్లి గ్రామానికి చెందిన జిల్లేపల్లి కొండాచారి తమ జీవనోపాధికై రోజువారి వేతనానికి కార్పెంటర్ గా పని చేస్తుంటారు. తన భార్య, ఇద్దరు కుమార్తెలతో కలిసి ఓ చిన్న రేకుల ఇంట్లో నివసిస్తున్నారు. గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతూ కుటుంబాన్ని పోషించుకోవడంలో కొండాచారి తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.వీరి పెద్ద కుమార్తె శిరీష, బి.టెక్ చదువుతున్న ప్రతిభా వంతురాలు. ఆమె వివాహం ఈ నెల ఫిబ్రవరి 15వ తారీకున ఉచితంగా లభించిన స్థానిక మినీ ఫంక్షన్ హాల్‌లో జరిగింది. తన కొద్ది పాటి సంపాదనతో, పెళ్లి నిర్వహణకు అవసరమైన ఖర్చులను భరించడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్న కొండాచారి వెస్సో ట్రస్ట్ సహాయాన్ని కోరగా, వెస్సో గౌరవ దాతల సహకారం తో అతనికి రూ. 45,300/-ల ఆర్థిక సహాయాన్ని అందజేసింది. ఈ సందర్భంగా వెస్సో ట్రస్ట్ అధ్యక్షులు బంగారు తాతారావు మాట్లాడుతూ వధువు శిరీష వివాహానికి తమ మద్దతు నిచ్చిన గౌరవ దాతలకు పేరు పేరునా హృదయపూర్వక ధన్యవాదములు తెలిపారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :