Monday, 27 July 2026 01:49:19 AM

నారాయణ క్యాంపస్‌లో విద్యార్థులకు అస్వస్థత...

60 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్..

Date : 09 March 2025 04:32 PM Views : 386

ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / రంగారెడ్డి జిల్లా : ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం కుంట్లూరు గ్రామంలోని నారాయణ బాసర ఐఐటి క్యాంపస్ లో ఫుడ్ పాయిజనింగ్‌ కావడంతో 60 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఆలు కూర్మ తినడంతో పలువురు విద్యార్థినిలు అస్వస్థతకు గురయ్యారు. దీంతో మోషన్స్, వాంతులతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దీంతో వెంటనే కళాశాల యాజమాన్యం వైద్యులను తీసుకువచ్చి ఓఆర్ఎస్, కొబ్బరి బోండాలతో తాత్కాలిక ఉపశమనం కలిగించేందుకు ప్రయత్నాలు చేస్తుండగా విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లలను చూసుకోనివ్వడం లేదని, పిల్లల దగ్గరకు వెళ్దామంటే ఒప్పుకోవడం లేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :