Tuesday, 28 July 2026 11:59:19 AM

అర్ధరాత్రి నోటీసులు ప్రజాస్వామ్యానికి మచ్చ... కేసీఆర్‌కు సిట్ నోటీసులు రాజకీయ కక్షే...

ఫోన్ ట్యాపింగ్ పేరుతో ప్రతిపక్షంపై వేధింపులు.. బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్..

Date : 01 February 2026 01:35 PM Views : 420

ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / : ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సిట్ నోటీసులు జారీ చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ బీఆర్‌ఎస్ పార్టీ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ లు బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ... అర్ధరాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో రాత్రి 9 గంటలకు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసిఆర్ ఇంటికి వెళ్లి సిట్ అధికారులు నోటీసులు అంటించడాన్ని ఆయన తప్పు పట్టారు.రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ తరహా చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు, నోటీసులతో వేధింపులకు దిగుతోందని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని సాకుగా చేసుకుని కేసీఆర్ ప్రతిష్టను దెబ్బ తీయాలనే కుట్ర జరుగుతోందని పేర్కొన్నారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఇటువంటి స్టంట్ రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు.రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ప్రతిపక్షంపై దాడులు చేస్తోందని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్షాన్ని గౌరవించాల్సిన అవసరం ఉందని, కానీ ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ కక్షపూరిత పాలన సాగుతోందని మండిపడ్డారు.కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సాధించుకున్న ప్రజలు ఈ పరిణామాలను గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. ఎన్ని నోటీసులు ఇచ్చినా, ఎన్ని కేసులు పెట్టినా బీఆర్‌ఎస్పార్టీ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు కౌశిక హరి, నాయకులు గోపు అయిలయ్య యాదవ్, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి, పర్లపల్లి రవి, మురళీధర్ రావు, గుంపుల లక్ష్మి, రమ్య యాదవ్, తదితరులు పాల్గొన్నారు,

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :