Tuesday, 28 July 2026 01:37:01 PM

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై జర్నలిస్టుల ఆగ్రహం – నల్ల బ్యాడ్జీలతో ర్యాలీ, ధర్నా

Date : 21 July 2025 02:06 PM Views : 383

ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి జిల్లా : భూపాలపల్లి పట్టణంలో జర్నలిస్టులు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేశారు.కాకతీయ ప్రెస్ క్లబ్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు జర్నలిస్టులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ సెంటర్ వద్ద ప్లకార్డులు ప్రదర్శిస్తూ ధర్నా చేపట్టారు. నేటి మంత్రుల పర్యటన ప్రోగ్రామ్‌ను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు.జర్నలిస్టులపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వెంటనే క్షమాపణ చెప్పాలని, జర్నలిస్టుల గౌరవాన్ని కాపాడాలని ఈ సందర్భంగా పత్రికా ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :