Tuesday, 28 July 2026 05:25:45 AM

ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల పెంపు కోసం కలెక్టర్ పిలుపు...

Date : 06 June 2025 02:31 PM Views : 324

ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / ములుగు జిల్లా : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచే దిశగా ఉపాధ్యాయులు, అధికారులు సమష్టిగా కృషి చేయాలని ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ సూచించారు. శుక్రవారం ములుగు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్‌తో కలిసి జెండా ఊపి కలెక్టర్ ప్రారంభించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును గణనీయంగా పెంచాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ బోధన విధానాలను తల్లిదండ్రులకు వివరిస్తూ ప్రచారం జరపాలని, అలాగే పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థుల విజయాలను గ్రామస్థాయిలో తెలియజేయడం ద్వారా ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో నమ్మకం పెంపొందించవచ్చన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి జి. పాణిని, సమగ్ర శిక్ష కోఆర్డినేటర్లు అర్షం రాజు, గ్యాదరి రమాదేవి, గుళ్ళపెల్లి సాంబయ్య, వయోజన విద్య జిల్లా కోఆర్డినేటర్ వేణుగోపాల్, మండల విద్యాధికారి వజ్జ తిరుపతి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు వినోద్ కుమార్, ఝాన్సీ, ఉమాదేవి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :