Tuesday, 28 July 2026 06:36:29 AM

ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం...

Date : 08 October 2024 12:48 PM Views : 629

ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / సంగారెడ్డి జిల్లా : సంగారెడ్డిలోని జహీరాబాద్ బీదర్ రోడ్డుపై న్యాల్‌కల్ మండలం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. వివరాల్లోకి వెళ్తే... గణేష్‌పూర్‌కి చెందిన గునెల్లి సిద్రామ్ కుటుంబ సభ్యులతో కలిసి పొలానికి వెళ్లారు. పొలం నుంచి తిరిగి వస్తుండగా.. బీదర్ వైపు వెళ్తున్న కర్ణాటక బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాద ఘటనలో సిద్రామ్‌తో పాటు అతని అల్లుడు, కుమార్తె, మనవడు మరణించారు. సిద్రామ్ అక్కడిక్కడే మరణించగా.. మిగతా వారు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ మరణించారు. వీరి మృతితో గ్రామమంతా విషాదంలో మునిగిపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు.ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :