ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / హైదరాబాద్ : డిఫరెంట్లీ ఎబుల్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఆద్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లా ల వికలాంగ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం గాంధీ భవన్ లో ప్రకాశం హాల్ లో ఘనంగా జరిగింది ఈ సమావేశానికి దాదాపు 1200 మందీ వికలాంగుల ఉద్యోగులు హాజరైనారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వీరయ్య ముత్తినేనిని గాంధీ భవన్ ప్రకాశం హాల్ లో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వీరయ్య మాట్లాడుతూ వికలాంగుల ఉద్యోగుల పట్ల గత KCR ప్రభుత్వం ఉక్కుపాదం మోపిందని, కనీసము వినతి పత్రం ఇవ్వడానికీ కూడా అవకాశము ఇవ్వలేదని వికలాంగుల హక్కుల చట్టం 2016 ప్రకారము ఉద్యోగుల ప్రమోషన్లలో 3% నుండి4%కి పెంచకుండా అన్యాయం చేశారని ,pwd act 1995,RPWD act 2016 నీ మరియు Go MS No 1 ఉత్తర్వులు ప్రకారం 40% వైకల్యం ను అన్నీ ప్రయోజనాలకి వర్తింప చేయాలీ కాని దీన్ని తుంగలో త్రొక్కుతూ గత ప్రభుత్వం ఉద్యోగుల చేత కోర్టుల్లో కేసులు వేయించి ఇబ్బంది పెట్టింది అని ఆన్నారు. కానీ వికలాంగుల ఆత్మ బంధువు ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి వికలాంగుల శాఖ మంత్రి వర్యులు సీతక్క దృష్టికి తీసుకెళ్ళి వికలాంగుల హక్కుల చట్టం 2016 ప్రకారం వికలాంగ ఉద్యోగుల ప్రమోషన్ రిజర్వేషన్లు 3%నుండీ 4% పెంచుతాం అన్నారు ప్రపంచ వికలాంగుల దినోత్సవం రోజున వికలాంగ ఉద్యోగులకి ఆన్ డ్యూటీ సౌకర్యం ను , అసోసియేషన్ కీ గుర్తింపును, వికలాంగుల ఉద్యోగుల ఉన్నత చదువులు కీ SC,ST లాగా పూర్తి వేతనం తో కూడిన ఆన్ డ్యూటీ సౌకర్యం,వికలాంగుల కి కేటాయించిన రోస్టర్ పాయింట్ల లో క్యారీ ఫార్వర్డ్ నీ జనరల్ కేటగిరీ వాళ్లు తో నింపకుండా బ్యాక్ లాగ్ కి మార్చాలి , దీర్ఘ కాలికంగా గత ప్రభుత్వ హాయం లో సేర్ప్,వ్యవసాయ, విద్యుత్, వైద్య, ఐసీడీఎస్, విద్యా , ఇతరత్రా &రైల్వే డిపార్టు మెంట్లలో ఉన్న సమస్యలు అన్నింటినీ పరిష్కరించేలా చేస్తాను అన్నారు. ఉద్యోగులు సంఘము గత 10 ఎండ్లుగా వికలాంగుల తరుపున అలుపెరుగకుండా ఆనేక అంశాలపై ఉద్యమం చేసిన వీరన్న కి కార్పొరేషన్ పదవి ఇవ్వడం పట్ల రాష్ట్ర ముఖ్య మంత్రి వర్యులు గౌరవ నియులు రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తీర్మాణం ఏకగ్రీవంగా కరతాళ ధ్వనులతో తెలిపారు.ఈ కార్యక్రమం లో వికలాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్ శైలజ, డిఫరెంట్లి ఎబుల్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు హాబీబ్ మియా, జనరల్ సెక్రటరీ చిరబోయిన లక్ష్మయ్య , ట్రెజరీ వెంకట్ నర్సయ్య, గౌరవాధ్యక్షుడు ముక్కు నర్సయ్య, బొల్లం మహేందర్, బిళ్ళ మహేందర్, మున్న నరసమ్మ, బండి నాగేశ్వర రావు & 33 జిల్లాల అధ్యక్షులు, వారీ కార్యవర్గాలు హాజరైనారు
Admin
Aakanksha News