Wednesday, 29 July 2026 12:59:59 PM

ఎన్టీపీసీలో విధులు నిర్వహిస్తూ గుండెపోటుతో కాంట్రాక్ట్ కార్మికుడు మృతి

Date : 01 August 2025 12:41 PM Views : 518

ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / గోదావరిఖని : పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టిపిసి ప్లాంట్ లో శుక్రవారం ఉదయం విధులు నిర్వహిస్తున్న సమయంలో కాంట్రాక్ట్ కార్మికుడు నరిశెట్టి శ్రీకాంత్ (32) ఆకస్మికంగా గుండెపోటుకు గురై మృతి చెందాడు. సహోద్యోగులు వెంటనే ఆయనను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినా అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు, కార్మిక సంఘాల నేత కౌశిక్ హరి ఆసుపత్రికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం శ్రీవారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి సాంత్వన చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ – "శ్రీకాంత్ మృతి కార్మికవర్గానికి తీరనని లోటు. ఆయన కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఆదుకోవాల్సిన బాధ్యత యాజమాన్యంపై ఉంది" అని పేర్కొన్నారు. కుటుంబాన్ని ఆదుకునేందుకు ఎన్టిపిసి యాజమాన్యాన్ని వెంటనే సంప్రదించిన కౌశిక్ హరి, ఎక్స్‌గ్రేషియా చెల్లింపు తో పాటు కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగావకాశం కల్పించేందుకు తాను కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ విషయంలో అధికారులతో సంప్రదింపులు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు.కాంట్రాక్ట్ కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం తన పోరాటం కొనసాగుతుందని కూడా హరి స్పష్టం చేశారు. శ్రీకాంత్ మృతిపై పలువురు కార్మికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో శ్రీవారి అంత్యక్రియలు నేడు గ్రామంలో నిర్వహించనున్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :