Wednesday, 29 July 2026 09:23:58 AM

చంచల్ గూడ జైల్లో అనుమానాస్పద స్థితిలో ఓ ఖైదీ మృతి...

Date : 12 February 2024 06:23 PM Views : 490

ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / హైదరాబాద్ : చంచల్ గూడ జైల్లో అనుమానాస్పద స్థితిలో ఓ ఖైదీ మృతి చెందాడు. కిస్మత్ పూర్‌కు చెందిన ముడావత్ రాజును గత నాలుగు రోజుల క్రితం రాజేంద్రనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. గుడిలో దొంగతనం చేసిన కేసులో ముడావత్ రాజు, శ్రీనులు నిందితులుగా ఉన్నారు. వారెంట్ ఉండడంతో రాజును పోలీసులు అదుపులోకి తీసుకొని చంచల్ గూడ జైల్‌కు తరలించారు. సోమవారం ఉదయం రాజు చనిపోయాడంటూ అతని కొడుకుకు పోలీసులు ఫోన్ చేశారు. దీంతో రాజు మృతిపై పలు అనుమానాలు ఉన్నాయంటూ కుటుంబ సభ్యులు వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రాజు మృతదేహన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :