Wednesday, 29 July 2026 08:28:30 AM

గురుకుల పాఠశాలలో పాము కాటుకు గురైన విద్యార్ధి...

Date : 19 December 2024 12:25 PM Views : 495

ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / జగిత్యాల జిల్లా : మరో విద్యార్థి పాము కాటుకు గురైన సంఘటన జగిత్యాల జిల్లా పెద్దాపూర్‌ గురుకుల పాఠశాలలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే...ఎనిమిదో తరగతి చదువుతున్న యశ్వంత్‌ అనే విద్యార్థిని పాము కాటేసింది. దీంతో స్కూల్‌ ప్రిన్సిపల్‌ అతడిని కోరుట్ల దవాఖానకు తరలించారు. బుధవారం ఇదే స్కూల్‌లో ఓంకార్‌, అఖిల్‌ అనే విద్యార్థిని పాము కరిచిన విషయం తెలిసిందే.యశ్వంత్‌ ఉదయం నిద్రలేచేసరికి కాలుకు గాయమై ఉండటం దురదలు రావడంతో విషయాన్ని ప్రిన్సిపల్‌కు తెలియజేయడంతో వెంటనే యశ్వంత్‌ను కోరుట్ల పట్టణంలోని ప్రభుత్వ అస్పత్రికి తరలించారు. అక్కడ టెస్టులు చేయగా పాము కాటేసినట్లు తేలింది. ప్రస్తుతం విద్యార్థికి అస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే ఇదే గురుకుల పాఠశాలలో పాములు ఆరుగురిని కాటేశాయి. వారిలో ఇద్దరు మృతి చెందారు. వరుస పాము కాటు ఘటనలతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :