Sunday, 26 April 2026 05:49:42 PM

ప్రియుడిని చంపినా కేసులో ప్రియురాలికి ఉరి శిక్ష....

కేరళ కోర్టు సంచలన తీర్పు..

Date : 21 January 2025 07:08 AM Views : 546

ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / ఆకాంక్ష డెస్క్ : కేరళలో విషం కలిపిన కూల్‌డ్రింక్ ఇచ్చి ప్రియుడు శరోన్ రాజ్‌ను హత్యా చేసిన ఘటనలో ప్రియురాలు గ్రీష్మకు కేరళ కోర్టు ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. అలాగే సహకరించిన బంధువుకు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. వివరాల్లోకి వెళ్తే.. శరోన్ రాజ్‌ను 2022 అక్టోబర్ 14న తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలోని రామవర్మంచిరైలో ఉన్న తన ఇంటికి గ్రీష్మ రప్పించింది. పారాక్వాట్, హెర్బిసైడ్ కలిపిన ఆయుర్వేద టానిక్‌తో విషం కలిపింది. రాజ్ అక్టోబర్ 25, 2022న, ప్రాణాంతకమైన మిశ్రమాన్ని సేవించడంతో బహుళ అవయవ వైఫల్యానికి గురై ఆసుపత్రిలో మరణించాడు. నాగర్‌కోయిల్‌కు చెందిన ఆర్మీ మ్యాన్‌తో వివాహం నిశ్చయించినప్పటికీ, 22 ఏళ్ల గ్రీష్మ తమ సంబంధాన్ని ముగించుకోవడానికి షరోన్ నిరాకరించడంతో హత్యకు పథకం వేసిందని ప్రాసిక్యూషన్ కోర్టుకు తెలిపింది.విచారణ బృందం అందించిన అన్ని సాక్ష్యాలను కోర్టు పరిగణించింది. అయితే సాక్ష్యాలను పరిశీలించిన కోర్టు గ్రీష్మాకు నేర నేపథ్యం ఉందని గ్రహించింది. దీనికి తనకు ఎలాంటి నేర నేపథ్యం లేదని గ్రీష్మా చేసిన వాదనను కూడా కోర్టు తోసిపుచ్చింది.కోర్టు గ్రీష్మకు ఉరిశిక్ష ఆమె మామ నిర్మలకుమారన్ నాయర్‌ను మూడేళ్ల జైలు శిక్ష విధించగా సాక్ష్యం లేని కారణంగా ఆమె తల్లి సింధు సాక్ష్యాధారాలు లేకపోవడంతో నిర్దోషిగా విడుదలైంది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :