ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / మేదక్ జిల్లా : మెదక్ జిల్లా శివ్వంపేట మండలం బిక్య తండా గ్రామపంచాయతీ పరిధిలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. అక్రమ సంబంధం నేపథ్యంలో కరెంట్ షాక్ ఇచ్చి అన్నను తమ్ముడు హతమార్చాడు. వివరాల్లోకి వెళ్తే...నాను తండాకు చెందిన అన్న తేజావత్ శంకర్(28) కూలీ పనులు చేస్తుండగా.. తమ్ముడు గోపాల్ జులాయిగా తిరుగుతాడు.అయితే శంకర్ భార్య నాలుగేళ్ల క్రితం పుట్టింటికి వెళ్లిపోగా, కూలీ పనులు చేసే మరో మహిళతో వివాహేతర శమందం ఏర్పడింది. ఆ మహిళతోనే తమ్ముడు కూడా చనువుగా ఉండటంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు విభేదాలు జరుగుతున్నాయి. మహిళతో వివాహేతర సంబంధం అన్ని మనసులో పెట్టుకున్న గోపాల్ అర్ధరాత్రి మద్యం మత్తులో నిద్రిస్తున్న అన్న శంకర్ కుడి చేతి వేలికి, ఎడమ కాలు వేలుకు రెండు విద్యుత్తు తీగలను చుట్టి స్విచ్ వేయడంతో షాక్ కొట్టి శంకర్ గట్టిగా అరవడంతో తండ్రి నిద్ర లేచాడు..దీంతో తండ్రిని చూసిన గోపాల్ అక్కడి నుండి పారిపోగా, శంకర్ అప్పటికే మరణించాడు.
Admin
Aakanksha News