ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / : మణుగూరు పోలీస్ స్టేషన్ సబ్‌ఇన్‌స్పెక్టర్ (ఎస్ఐ) రంజిత్ అవినీతి వ్యతిరేక శాఖ (ఏసీబీ) వలలో చిక్కాడు. ఒక కేసు విషయంలో స్టేషన్ బెయిల్ మంజూరుకు సంబంధించి బాధితుడి వద్ద నుండి రూ.40 వేల లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఏసీబీ అధికారులు ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆడియో, వీడియో టేపుల ద్వారా ఆధారాలను సేకరించి శనివారం ట్రాప్ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో మణుగూరు పోలీస్ స్టేషన్‌లోనే ఎస్ఐ రంజిత్‌ను విచారించి అదుపులోకి తీసుకున్నట్లు ఖమ్మం ఏసీబీ ఇన్‌ఛార్జ్ డీఎస్పీ విజయ్‌కుమార్ వెల్లడించారు.ప్రస్తుతం రంజిత్‌ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని మరిన్ని వివరాలు తెలుసుకుంటున్నారు. ఈ ఘటనతో మణుగూరులో కలకలం రేగింది. దీనిపై మరింత పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది..
Admin
Aakanksha News