ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / జగిత్యాల జిల్లా : భర్త అక్రమ సంబంధం పెట్టుకొని, అదనపు వరకట్నం కోసం భార్యను వేధించడంతో మనస్తాపానికి గురై.. ఈనెల 14న ఇద్దరు పిల్లలకు గడ్డి మందు తాగించి, తాను తాగి ఆత్మహత్య చేసుకుంది.ఈ ఘటనలో హారిక అక్కడిక్కడే ప్రాణాలు విడవగా ఇద్దరు పిల్లలు కృష్ణాంత్(9), మాయంతలక్ష్మి(8) రాత్రి మృతి చెందారు. పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య చేసుకున్న విషాదకర ఘటన జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం మద్దులపల్లిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. భర్త తిరుపతి వరకట్నపు వేధింపులకు గురి చేయడంతో పాటు మరో మహిళను ఇంటికి తెచ్చుకునే వాడని హారిక తమతో చెప్పి బాధపడేదని మృతురాలి తల్లి దండ్రులు కన్నీరు మున్నీరు అయ్యారు. వరకట్నం కోసం నిత్యం వేధించేవాడని తెలిపారు. ముగ్గురి మృతికి కారణమైన తిరుపతిని కఠినంగా శిక్షించాలని పోలీసులను హారిక కుటుంబసభ్యులు కోరారు.
Admin
Aakanksha News