Friday, 12 June 2026 01:35:14 AM

9 ఏళ్ల క్రితం చనిపోయిన వ్యక్తిపై కేసు... ఇన్స్‌పెక్టర్ సస్పెండ్

Date : 20 May 2025 07:32 PM Views : 707

ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / హన్మకొండ జిల్లా : భూకబ్జా కేసులో 9 ఏళ్ల క్రితం మరణించిన వ్యక్తిని నిందితుడిగా చూపిన ఏజే మిల్స్ పోలీస్ స్టేషన్ ఇన్స్‌పెక్టర్ జె. వెంకట రత్నంను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు.వివరాల్లోకి వెళ్తే, ఓ భూ వివాదంలో బాధితులకు న్యాయం చేయకుండా, తప్పుడు వివరాలతో కేసు నమోదు చేయడమే కాకుండా, మృతుడి పేరును కూడా కేసులో చేర్చి నిందితులకు సహకరించినట్లు విచారణలో తేలింది. అంతే కాకుండా, మరో కేసులో ఓ మహిళా నిందితురాలిపై స్టేషన్ ఆవరణలో లైంగిక వేధింపులకు పాల్పడ్డట్లు ఆరోపణలు వచ్చాయి. విచారణలో ఈ ఆరోపణలు నిజం కావడంతో కమిషనర్ చర్యలు తీసుకున్నారు.ఈ ఘటనపై పోలీసు విభాగం పరువుకు నష్టం కలిగించిన నేపథ్యంలో బాధ్యత రహితంగా వ్యవహరించాల్సిన అధికారుల వైఖరిపై నిఘా పెంచినట్లు సమాచారం.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :