ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / కరీంనగర్ జిల్లా : ఉరి వేసుకుని ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్న సంఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... చొప్పదండి మండలం చిట్యాలపల్లికి చెందిన అరుణ్ కుమార్ (24), అదే మండలం భూపాలపట్నంకు చెందిన అలేఖ్య (21) గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు.అయితే తమ పెళ్లికి కుటుంబ సభ్యులు ఒప్పుకోరేమో అనే భయంతో క్షణికావేశంలో తన స్నేహితుని గదిలో ఊరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు.స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
Admin
Aakanksha News