Tuesday, 28 July 2026 12:27:23 PM

వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 10మంది మృతి...

సత్యసాయి జిల్లా, నల్గొండ, హైదరాబాద్ లలో రోడ్డు ప్రమాదాలు..

Date : 21 December 2024 10:57 AM Views : 830

ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / ఆకాంక్ష డెస్క్ : వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 10 మంది మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే...ఆంధ్రప్రదేశ్ లోని సత్యసాయి జిల్లా మడకశిర మండలం బుళ్లసముద్రం సమీపంలో శనివారం తెల్లవారు జామున జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని మినీ వ్యాన్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదం సమయంలో మినీ వ్యాన్ లో 14 మంది ఉన్నట్లు తెలుస్తోంది. మృతులు గుడిబండ, అమరాపురం మండలాలకు చెందిన వారుగా గుర్తించారు. వీరంతా తిరుమల దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అలాగే తెలంగాణలోని నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. దేవరకొండ పట్టణ శివారులోని పెద్ద దర్గా వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. స్వీట్ షాపులోకి డీసీఎం వ్యాను దూసుకెళ్లడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన గురించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. అలాగే నల్లగొండ క్లాక్ టవర్ చర్చ్ పక్కన ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మద్యం మత్తులో టీవీఎస్ ఎక్సెల్ ద్విచక్ర వాహనంపై వస్తున్న ఇద్దరిపైకి లారీ దుసుకేళ్లడంతో గణేష్ అనే యువకుడు మృతి చెందాగా మహిళా సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదానికి గురి అయిన వారు నల్లగొండ వీటి కాలనీ వాసులుగా గుర్తించారు.లారీ డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.అలాగే హైదరాబాద్ లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీ కొట్టడంతో బీటెక్ విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే...కాలేజీకి వెళ్తున్న ఇద్దరి విద్యార్థులను అతి వేగంతో ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో లోకేష్ అనే 20 సంవత్సరాల బీటెక్ విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందాగా మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. రెండు రాష్ట్రాల్లో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదాలు పలువురు కుటుంబాలను కన్నీటి పర్యంతం చేశాయి.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :