ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / గోదావరిఖని : పిడియస్ రైస్ అక్రమ రవాణా చేస్తున్నారనే నమ్మదగిన సమాచారం మేరకు పెద్దపల్లి టాస్క్ ఫోర్సు సిఐ రమేష్ బాబు ఆధ్వర్యంలో ఎస్ఐ రాజేష, టాస్క్ ఫోర్సు సిబ్బంది రాత్రి గంగానగర్ వద్ద గోదావరిఖని నుండి వస్తున్న టాటా ఏసీ ట్రాలీ నెంబర్ AP 15 TA 8728 లో Thinglunanjidappa దర్శన్ అనే వ్యక్తి అక్రమంగా తరలిస్తున్న 25 క్వింటల్ల పిడిఎస్ రైస్ ని పట్టుకోవడం జరిగిందని పోలీసులు తెలిపారు. అక్రమంగా బియ్యాన్ని తరలిస్తున్న నిందితుడిని విచారించగా మహారాష్ట్రకు తీసుకెళుతున్నానని తెలిపినట్లు ఒక ప్రకటనలో టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలియజేశారు. తదుపరి విచారణ నిమిత్తం స్వాధీనం చేసుకున్న 25 క్వింటాళ్ల పిడిఎస్ రైస్, టాటా ఏసీ ట్రాలీ ఆటోను, నిందితుడిని గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో అప్పగించడం జరిగిందన్నారు.
Admin
Aakanksha News