ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / : పోత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కొలనూరు గ్రామ శివారు ప్రాంతంలో పేకాట ఆడుతున్న వారిపై పోలీసులు సడన్ దాడి నిర్వహించారు. విశ్వసనీయ సమాచారం ఆధారంగా ఎస్సై దీకొండ రమేష్ ఆధ్వర్యంలో పోలీసులు సోమవారం సాయంత్రం కొలనూరు గ్రామ శివారు ప్రాంతానికి చేరుకుని రైడ్ నిర్వహించారు. ఈ దాడిలో ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.3,050 నగదు మరియు పేక పత్తాలు స్వాధీనం చేసుకున్నారు.ఈ సందర్భంగా ఎస్సై దీకొండ రమేష్ మాట్లాడుతూ... గ్రామాల్లో పేకాట, కోడి పందాలు, ఆన్లైన్ బెట్టింగ్, క్రికెట్ బెట్టింగ్ వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించము. ఎవరైనా ఇలాంటి చర్యల్లో పాల్గొన్నా లేదా నిర్వహిస్తున్నా కఠిన చర్యలు తప్పవు” అని హెచ్చరించారు.అలాగే, ఇలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలు ఎక్కడైనా జరుగుతున్నట్లు తెలిసిన వారంతా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. “పోత్కపల్లి పోలీస్ స్టేషన్ నెంబర్ 8712656514కు సమాచారం అందించవచ్చు. సమాచారం ఇచ్చిన వారి పేర్లు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయి” అని ఎస్సై తెలిపారు. ప్రజా శాంతి భద్రతల పరిరక్షణలో ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని, గ్రామాల్లో చట్టవ్యతిరేక కార్యకలాపాలు జరగకుండా జాగ్రత్త వహించాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా పోత్కపల్లి పోలీసులు పేకాటలో పాల్గొన్న ఐదుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.స్థానికులు పోలీసులు చేపట్టిన ఈ చర్యకు మద్దతు తెలుపుతూ, గ్రామాలలో ఇలాంటి పేకాట స్థావరాలు, కోడి పందాలు పూర్తిగా అరికట్టాలని కోరారు. పోలీసుల ఈ చర్యతో కొలనూరు గ్రామ పరిసర ప్రాంతాల్లో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు గట్టి చెక్ పడినట్లైంది.
Admin
Aakanksha News