Wednesday, 29 July 2026 06:01:36 AM

జనసంద్రోహం మధ్య ఫైటింగ్....

పండుగ పూట భయభ్రాంతులకు గురైన ప్రజలు...

Date : 13 October 2024 01:00 PM Views : 1679

ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / గోదావరిఖని : ఓ వైపు దసరా ఉత్సవాలు స్టేడియంలో ఘనంగా జరుగుతున్నాయి. చుట్టూ జనంతో కొలహాలం, మరో వైపు అధికారుల బందోబస్తూ... ఇంత మంది ఉన్న కనీస భయం లేని కొంత మంది యువకులు మద్యం మత్తులో సినిమా తరహాలో ఫైటింగ్ చేస్తున్నా వారిని కట్టడి చేసే వారే కరువయ్యారు. ఈ సంఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... దసరా ఉత్సవాలు నిర్వహిస్తున్న క్రమంలో కొంతమంది యువకులు మద్యం మత్తులో స్టేడియంలో జనసంచారం మధ్య ఘర్షణకు దిగారు. ఈ సంఘటనతో ఒక్కసారిగా ఉత్సవాలకు వచ్చిన ప్రజలు పిల్లలు భయభ్రాంతులకు గురయ్యారు. అయితే వారిని అడ్డుకోవాల్సిన వారే లేకపోవడంతో చూస్తూ ఉండి పోవాల్సిన పరిస్థితి నెలకొందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై స్థానిక ప్రజల నుండి తీవ్ర స్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :