Tuesday, 28 July 2026 12:09:23 PM

యాదాద్రి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం...

భారీ కంటైనర్‌ను ఢీకొన్న రెండు ప్రైవేటు ట్రావెల్స్‌..

Date : 26 March 2025 09:06 AM Views : 658

ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / : యాదాద్రి జిల్లాలోని చౌటుప్పల్‌ మండలం ధర్మోజిగూడెం జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది... వివరాల్లోకి వెళ్తే.. విజయవాడ నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్తున్న సమయంలో భారీ కంటైనర్‌ను రెండు ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులు వెనుక నుంచి ఢీకొట్టాయి. ఈ ప్రమాదంలో 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. అయితే ఈ ప్రమాదంలో ట్రావెల్స్‌ బస్సు డ్రైవర్‌ క్యాబిన్‌లో ఇరుక్కుపోయారు. దీంతో డ్రైవర్‌ను బయటకు తీయడానికి పోలీసులు తీవ్రంగా శ్రమించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :