Tuesday, 28 July 2026 04:00:51 AM

భూపాలపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం...

లారీ ఢీ కొని ద్విచక్ర వాహనదారుడు మృతి... మరొకరికి తీవ్ర గాయాలు...

Date : 17 October 2024 05:17 PM Views : 681

ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / జయశంకర్ భూపాలపల్లి జిల్లా : భూపాలపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది... లారీ ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్ర గాయాల పాలైన మహదేవ్ పూర్ మండలంలోని బెగ్లూరు, సూరారం, గ్రామాల మధ్య ఈ సంఘటన చోటు చేసుకుంది.... వివరాల్లోకి వెళ్తే...బెగ్లూర్ గ్రామానికి చెందిన దోమల రమేష్ అనే వ్యక్తి, తన స్నేహితుడితో కలిసి పని నిమిత్తం మహదేవపూర్ కు వెళ్లి తిరిగి వస్తుండగా, ఇసుక లోడుతో హైదరాబాద్ కు వెళ్తున్న లారీ బైక్ ను ఢీకొట్టడంతో దోమల రమేష్ లారీ టైర్ కింద పడిపోవడంతో అక్కడిక్కడే మృతి చెందాడు.మరో వ్యక్తి సంఘటన స్థలానికి దూరంగా పడిపోవడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :