Sunday, 26 April 2026 05:49:42 PM

చిన్నారులను మింగేసిన సరదా..

ఈతకు వెళ్లి ముగ్గురు మృతి

Date : 14 April 2023 08:32 PM Views : 372

ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / గోదావరిఖని : ముగ్గురు స్నేహితుల సరదా.. మూడు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది.. పాఠశాలకు సెలవు రోజు కావడంతో మండుతున్న ఎండలలో సరదాగా గడపడానికి ఈతకు వెళ్లిన ముగ్గురు స్నేహితులు మృతి యువత పడడంతో విషాద ఛాయలు అలముకున్నాయి. వివరాల్లోకి వెళ్తే...పెద్దపల్లి జిల్లా NTPC న్యూ పోరట్ పల్లికి చెందిన సాయి చరణ్,ఉమామహేశ్వర్, విక్రమ్ ముగ్గురు స్నేహితులు పాఠశాలకు సెలవు కావడంతో సరదాగా పక్కనే ఉన్న మేడిపల్లి చెరువులోకి ఈతకు వెళ్లారు. ఈత రాని ముగ్గురు స్నేహితులు చెరువులో మునిగి మృత్యువాత పడడంతో ఆ కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది .మృతదేహాలను గోదావరిఖనిలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :