ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / కామారెడ్డి జిల్లా : రాష్ట వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎస్‌ఐ, కానిస్టేబుల్,కంప్యూటర్ ఆపరేటర్ ల ఆత్మహత్య ఘటనలో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి.అయితే, వారి ఆత్మహత్యకు కారణాలేంటనే విషయంలో గందరగోళం నెలకొంది. ముగ్గురు చనిపోవడం, ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన వారు ఎవరూ లేకపోవడంతో పాటు మృతులకు సంబంధించిన ఫోన్లు లాక్ ఓపెన్ కాకపోవడంతో ఈ కేసు పోలీసులకు సవాల్ గా మారింది. ఈ కేసును ఛేదించేందుకు ఇప్పటికే పోలీసులు అన్ని విధాలుగా విచారణ చేపడుతున్నారు. మృతుల కుటుంబ సభ్యులతో పాటు వారి దగ్గరి బంధువుల నుండి వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ ట్రయాంగిల్ ప్రేమాయణంలో విధి నిర్వహణలో కానిస్టేబుల్ శృతితో ఏర్పడిన పరిచయం ఎస్‌ఐ సాయి కుమార్ తో వివాహేతర సంబంధానికి దారి తీసిందనే ప్రచారం జరుగుతోంది. అంతక ముందు నుండే కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ తో ప్రేమలో ఉన్న మహిళా కానిస్టేబుల్ శృతి నిఖిల్‌ను ఎస్‌ఐకి స్నేహితుడిగా పరిచయం చేస్తే కొద్దీ రోజులు తాను సేఫ్ గా ఉండవచ్చని కానిస్టేబుల్ శృతి భావించి స్నేహితుడిగా పరిచయం చేసినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఎస్‌ఐ సాయి కుమార్ భిక్కనూరుకు బదిలీ కావడంతో శృతి మధ్య దూరం పెరగడంతో వీరి మధ్య ఉన్న ప్రేమ వ్యవహారం బయటపడినట్లు ప్రచారం సాగుతోంది.ఆ తర్వాత శతి, నిఖిల్ ల ప్రేమ వ్యవహారం తెలియడంతో ఎస్‌ఐ సాయికుమార్ ఇద్దరినీ నిలదీశారని, ఈ విషయంపై మాట్లాడుకోవడానికే ముగ్గురూ అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువు దగ్గర కలిశారని అధికారులు భావిస్తున్నారు. మాటామాటా పెరగడంతో బెదిరించేందుకు శృతి ముందుగా చెరువులో దూకి ఉండవచ్చని, ఆ తర్వాత నిఖిల్ కూడా దూకడంతో ఆందోళనకు గురైన ఎస్‌ఐ సాయి కుమార్ కూడా ఆత్మహత్య చేసుకుని ఉంటాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఇప్పటికే మృతుల సెల్ ఫోన్ డాటా, వాట్స్ ఆప్ చాటింగ్స్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు.
Admin
Aakanksha News