Tuesday, 28 July 2026 06:39:58 AM

పోలీస్ శాఖలో ఆందోళనకరంగా మారుతున్న ఆత్మహత్యలు...

ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇద్దరి పోలీసుల ఆత్మహత్య

Date : 29 December 2024 10:37 AM Views : 2015

ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / మేదక్ జిల్లా : ఎంతో కష్ఠపడి ఉద్యోగం సాధించి పోలీస్ శిక్షణలో కఠినమైన ట్రైనింగ్ తీసుకొని అన్ని రకాలుగా మంచి చెడులు అనుభవించి ఉద్యోగంలో చేరిన తరువాత కుటుంబ సభ్యులతో సంతోషంగా జీవనం సాగించాల్సిన కొంత మంది పోలీసులు వరుసగా కొన్ని కొన్ని కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడటం రాష్ట్ర వ్యాప్తంగా కలవరాన్ని సృష్టిస్తుంది. ఆపదలో ఉండి కష్టం వచ్చిందని పోలీస్ స్టేషన్ కు వచ్చే వారి కష్టాలను విని పరిష్కారాన్ని చూపించే పోలీస్ శాఖ ఇప్పుడు వరుస ఆత్మహత్యలతో చర్చనియాంశంగా మారుతుంది. పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు మనో ధైర్యాన్ని నిప్పే పోలీసులే మనో ధైర్యాన్ని కోల్పోవడం పట్ల ఆందోళనకర పరిస్థితులు నెలకొంటున్నాయి. వివరాల్లోకి వెళ్తే..ఉమ్మడి మెదక్ జిల్లాలో పోలీసు శాఖలో పని చేస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లు ఆత్మహత్యకు పాల్పడ్డారు.ఒక్కరు మెదక్ జిల్లాలోని కొల్చారం పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న సాయికుమార్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ క్వార్టర్ ఆవరణలో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోగా బెటాలియన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న బాలకృష్ణ కుటుంబ సభ్యులకు విషమిచ్చి తాను ఆత్మహత్య కు పాల్పడ్డాడు. బాలకృష్ణ మృతి చెందగా అతని భార్య తో పాటు ఇద్దరు చిన్న పిల్లల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇద్దరు వేర్వేరు కారణాలతో సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవలి కాలంలో పోలీస్ శాఖలో జరుగుతున్న ఆత్మహత్య లు కలకలం రేపుతున్నాయి. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :