Tuesday, 28 July 2026 08:32:12 AM

ఉరి వేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య...

Date : 31 January 2025 02:32 PM Views : 459

ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / హైదరాబాద్ : సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం పరితపిస్తూ ప్రజారక్షణ దేయంగా పనిచేస్తున్న ఎంతోమంది పోలీసులు తమ ఆత్మస్థైర్యాన్ని కోల్పోతూ ఆత్మహత్యలు చేసుకోవడం సంచలనాన్ని సృష్టిస్తుంది. ఈ మధ్యకాలంలో పోలీసుల ఆత్మహత్యలు పెరిగిపోవడంతో ఆందోళనకర పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ నేపాధ్యంలోనే ఉరి వేసుకుని ఓ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన అంబర్‌పేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... సీఐ అశోక్‌ తెలిపిన వివరాల ప్రకారం....2007 బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుల్ అంబర్‌పేట దుర్గానగర్‌లో నివాసముంటూ మాదన్న పేట పోలీస్‌ స్టేషన్‌లో వెంకటేశ్వర్లు (42) విధులు నిర్వహిస్తున్నారు.ఆయనకు భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. అయితే ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు చున్నితో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే కారణమా.. లేక మరేమైన కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది...

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :