ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / గోదావరిఖని : చుట్టూ జనం... పక్కనే ప్రభుత్వ పాఠశాల,కళశాల మరో వైపు మైదానంలో విద్యార్థులు ఇంత మంది చూస్తూ ఉండగానే ఒక్క సరిగా జరిగిన సంఘటన అందరిని భయబ్రాంతులకు గురి చేసింది. ఓ యువకుడిపై పట్టపగలే కత్తిపోట్లు జరగడం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళ్తే అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు... మార్కండేయ కాలనీలోని కంప్యూటర్ సెంటర్ లో పని చేస్తున్న నంది శ్రీనివాస్ కు బీమారంలో భూ పంచాయితీలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే బీమారంకు చెందిన ఓ యువకుడు మొదటగా శ్రీనివాస్ ను మాట్లాడుకుందామని పిలిచి ఒక్క సరిగా తన దగ్గర ఉన్న తల్వార్ తో అందరు చూస్తుండగానే పొడవడంతో తీవ్ర రక్త స్రావంతో అక్కడికక్కడే కుప్పకూలి కిందపడిపోయాడు. దీంతో వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కత్తిపోట్లకు గురైన శ్రీనివాస్ ను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే వీరి మధ్య గత కొంత కాలంగా భూ పంచాయితీతో పాటు అక్రమ సంబంధం వ్యవహారంలో గొడవలు జరుగుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది...
Admin
Aakanksha News