Wednesday, 29 July 2026 08:29:24 AM

బ్రతికుండగానే స్మశాన వాటికలో వదిలి వెళ్లిన మేనల్లుడు....

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలో హృదయ విధారకమైన ఘటన

Date : 22 October 2024 11:03 PM Views : 584

ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / రాజన్న సిరిసిల్ల జిల్లా : సమాజంలో మానవ సంబంధాలు మంట కలుస్తున్నాయి అని చెప్పడానికి ఈ సంఘటనే నిదర్శనం. బ్రతికి ఉండాగానే స్మశాన వాటికలో మేనత్తను వదిలి వెళ్లిన మేనల్లుడి ఉదాంతం రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.... కూకట్ల రాజవ్వ (70) అనే వృద్ధురాలికి కొడుకులు, బిడ్డలు ఎవరు లేక పోవడంతో తన మేనల్లుడు కూకట్ల తిరుపతి వద్ద ఉంటుంది. అయితే మంగళవారం బ్రతికుండగానే స్మశాన వాటికలోని వరండాలో రాజవ్వ మేనల్లుడు వదిలి వెళ్ళాడు.దీంతో ఉదయం నుండి ఆకలితో అలమటిస్తూ కొన ఊపిరితో ఉన్న వృద్ధురాలిని చుసిన వారు సంబంధిత అధికారులకు సమాచారం అందించడంతో వెంటనే ఘటన స్థలానికి చేరుకొని వృద్దురాలిని కాపాడి మేనల్లుడి ఇంటి వద్దకు తీసుకవెళ్లారు. అనంతరం అధికారులు వృద్దురాలి మేనల్లుడు తిరుపతికి కౌన్సిలింగ్ ఇచ్చారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :