ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / కడప జిల్లా : తన కుతూరు ఇంటర్ ఫెయిల్ అయిందని తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన కడప జిల్లాలోని ఏఎన్నార్ నగర్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఏపీ ప్రభుత్వం ఇటీవల ఇంటర్ ఫలితాలు ప్రకటించిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు రాసిన గౌతమి ఓ సబ్జెట్‌లో ఫెయిల్ అయింది. దీంతో యువతిని ఆమె తండ్రి మందలించాడు. అయితే మనస్థాపం చెందిన గౌతమి ఇంటి నుంచి వెళ్లిపోయింది. కూతురు ఇంటి నుంచి వెళ్లిపోవటాన్ని జీర్ణించుకోలేని తల్లి ఆదిలక్ష్మీ తాను ఇక బ్రతికుండి వ్యర్థమని భావించింది. పట్టణ శివారులోని ఓ రైల్వే ట్రాక్ వద్దకు వెళ్లి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనతో ఆ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది.కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించి దర్యాప్తు చేపట్టారు.
Admin
Aakanksha News