Tuesday, 28 July 2026 12:07:25 PM

గోనె సంచిలో బాలిక మృతదేహం...

Date : 15 October 2024 06:44 PM Views : 419

ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / మెడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని బాసరగడి గ్రామంలో గోనె సంచిలో బాలిక మృతదేహం లభించింది. స్థానికుల వివరాల ప్రకారం.. అదిలాబాద్ జిల్లా చెందిన ప్రభాకర్ కుటుంబంతో కలిసి సూరారంలో నివాసం ఉంటున్నాడు. ఈ నెల 12న కుమార్తె ఏం జోష్న(7) కనిపించడం లేదని సూరారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, బాలిక మంగళవారం శవమై కనిపించింది. దీంతో చిన్నారి కుటుంబంలో విషాదం నెలకొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :