Wednesday, 29 July 2026 08:18:27 AM

వేధిస్తున్నాడని యువకుడి దారుణ హత్య

జైపూర్ మండలం ఇందారంలో దారుణ ఘటన

Date : 25 April 2023 12:07 PM Views : 1119

ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / మంచిర్యాల జిల్లా : మానవ సంబంధాలు మంట కలుస్తున్నాయి. అందరి చూస్తూ ఉండగానే మహేష్ అనే యువకుడిని అతి కిరాతంగా బాండ రాయితో కొట్టి చంపినా సంఘటన మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారంలో చోటుచేసుకుంది. గ్రామంలో గ్రామస్థులు అందరూ చూస్తుండగానే హత్య చేశారు. కనీసం అక్కడ ఎవరు కూడా ఆపే ప్రయత్నాలు చేయలేదు. అయితే ఓ వివాహితకు అసభ్యకరమైన మెస్సేజ్‌లు చేస్తున్నాడని యువకుడిని ఆమె కుటుంబ సభ్యులు హత్య చేశారు. స్థానికులు ఈ హత్యను వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :