Sunday, 26 April 2026 05:49:52 PM

వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం...

ఐదుగురు అక్కడికక్కడే మృతి..మరో ఆరుగురికి తీవ్ర గాయాలు

Date : 26 January 2025 01:09 PM Views : 586

ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / వరంగల్ జిల్లా : వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.మామునూరు వద్ద ఇనుప స్థంభాల లోడుతో వెళ్తున్న లారీ అదుపు తప్పి పక్కనే ఉన్న కారు, రెండు ఆటోలపై పడటంతో ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా..మరో ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. మృతుల్లో నలుగురు మహిళలతో పాటు..ఓ బాలుడు ఉన్నట్లు సమాచారం.మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ మద్యం మత్తులో ఉండటమే ఈ ప్రమాదానికి కారణం అని పోలీసులు అనుమానిస్తున్నారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :