Sunday, 26 April 2026 05:47:24 PM

నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో వైద్యం వికటించి బాలింత మృతి....

Date : 31 July 2025 01:20 PM Views : 543

ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / నాగర్‌కర్నూల్ జిల్లా : వైద్యం లోపంతో బాలింత మృతి చెందిన విషాద ఘటన అచ్చంపేట పట్టణంలోని ఏఎంఆర్ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. ఉప్పునుంతల మండలం అయ్యవారిపల్లి గ్రామానికి చెందిన శ్యామల బుధవారం సాయంత్రం కాన్పు కోసం ఏఎంఆర్ ఆసుపత్రికి చేరుకుంది. అక్కడ డాక్టర్ అర్చన, డాక్టర్ రామకృష్ణల నేతృత్వంలో శస్త్రచికిత్స చేయగా, ఆమె మగ శిశువుకు జన్మనిచ్చింది. అయితే ఆపరేషన్ అనంతరం అధిక రక్తస్రావం జరగడంతో పరిస్థితి విషమించింది. తక్షణమే హైదరాబాద్‌కు తరలించినా, చికిత్స పొందుతూ గురువారం ఉదయం ఆమె మృతి చెందింది.మృతదేహాన్ని అచ్చంపేటకు తీసుకొచ్చిన కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. వైద్యంలో నిర్లక్ష్యం జరిగిందంటూ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు.ఈ ఘటనపై సంబంధిత అధికారుల స్పందన కోరుతూ బాధిత కుటుంబం గళమెత్తుతోంది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :