ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / : సిగరెట్ కోసం పాన్ షాప్ యజమానితో జరిగిన సంఘటన పోలీస్ స్టేషన్ కు చేరింది.. దీంతో ఇరు వర్గాలను పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. వివరాల్లోకి వెళ్తే... గోదావరిఖని రాజేష్ థియేటర్ సమీపంలోని ఓ పాన్ షాప్ యజమాని దగ్గర కు యువకుడు సిగరెట్ కావాలని అడిగాక సమయం అయిపోయింది పక్కకు వెళ్లి తాగండి అని చెప్పే విషయంలో పాన్ షాప్ యజమానికి సదురు వ్యక్తికి గొడవ జరగడంతో చిలికి చిలికి గొడవ గాలి వానలా మారింది. దీంతో ఒక రూపాయి ఒకరు దాడి చేసుకోవడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది..
Admin
Aakanksha News