Tuesday, 28 July 2026 03:47:11 AM

విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ లో మిస్టీరియస్‌ డెత్‌...❓

మృతురాలు ఐదు నెలల గర్భిణీ...

Date : 27 April 2023 06:50 AM Views : 644

ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / విశాకపట్నం జిల్లా : విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ లో అనుమానాస్పద స్థితిలో యువతి మృతదేహం లభ్యమైంది. యువతి అర్ధనగ్నంగా ఉండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని పెద గంట్యాడకు చెందిన శ్వేతగా గుర్తించారు. వివరాల్లోకి వెళ్తే... ఏడాది క్రితం మణికంఠతో శ్వేతకు వివాహం కాగా ప్రస్తుతం 5నెలల గర్భిణి. అయితే తాను శ్వేతతో ఫోన్​ మాట్లాడుతుండగా స్విచ్ఛాఫ్​ అయిందని భర్త మణికంఠ తెలిపాడు. కుటుంబంలో సమస్యలు వస్తే పరిష్కరించుకుందామని చెప్పానని మణికంఠ తెలిపాడు. తాను శ్వేతను వేధించలేదని కడుపులో ఉన్న బిడ్డ కోసం ఆలోచించమని చెప్పానని మఠికంఠ తెలిపారు. అయితే ఒంటిపై దుస్తులు లేక పోవడంతో మృతిపై పోలీసులు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. న్యూ పోర్టు పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు కూడా నమోదైంది. ఇంతలోనే మృతదేహం లభ్యమవ్వడంతో పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. యువతి చనిపోయిన తర్వాత అర్ధరాత్రి మృతదేహం ఒడ్డుకు కొట్టుకు వచ్చి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. దీంతో యువతి మృతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.అయితే శ్వేత మృతదేహంపై ఎటువంటి గాయాలు లేవని పోలీసులు తెలిపారు. డెడ్‌బాడీ పడి ఉన్న తీరు చూస్తే హత్యేనన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఒంటిపై దుస్తులు సరిగా లేవు.. ఇసుకలో సగం డెడ్‌బాడీ కప్పేసినట్టుగా ఉంది. ఇది ఎవరో కావాలని చంపేసి.. తమ ఆనవాళ్లు దొరక్కుండా ఇసుకలో పాతిపెట్టినట్టు తెలుస్తోంది. ఆర్కేబీచ్‌ ఒడ్డున ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో చనిపోవడం అందర్నీ ఉలిక్కిపడేలా చేసింది.ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో ఆరాతీస్తున్నారు. శ్వేత ఇంట్లోంచి బయటకు ఎందుకు వెళ్లింది..? బయటకు వెళ్లాక ఎవర్ని కలిసింది.. శ్వేతది ఆత్మహత్యా? మరేదైన అఘాయిత్యమా అన్న కోణంలో దర్యాప్తు ఆ తర్వాత ఆర్కేబీచ్ పరిసరాలకు ఎవరితో వెళ్లింది..శ్వేతది ఆత్మహత్యా? మరేదైన అఘాయిత్యమా అన్న కోణంలో పోలసులు శ్వేత మొబైల్‌ ఫోన్‌ ఆధారంగా వివరాలు సేకరిస్తున్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :