ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / హైదరాబాద్ : పుష్ప-2 రిలీజ్ సందర్బంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసులాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే... ఈ ఘటనపై ఇప్పటికే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో అల్లు అర్జున్ పై పోలీసులు కేసు నమోదు చేయగా తాజాగా అల్లు అర్జున్‌ను ఆయన నివాసంలో పోలీసులు అరెస్ట్ చేశారు.అయితే అరెస్ట్ అనంతరం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీంతో విషయం తెలుసుకొని అల్లు అర్జున్ ను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ వద్దకు రావడంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసిన అనంతరం మరికాసేపట్లో వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపర్చనున్నారు. ఈ మేరకు అల్లు అర్జున్‌ను రిమాండ్‌కు తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Admin
Aakanksha News