Friday, 12 June 2026 01:37:07 AM

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేషనల్ అవార్డును అందుకున్న లక్కం నారాయణ..

Date : 09 October 2024 01:53 PM Views : 385

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేషనల్ అవార్డు -2024సంవత్సరమునకు గాను రామగుండం సింగరేణి ఆర్జీ-3 లో సివిల్ డిపార్ట్మెంట్ లో పని చేస్తూ దళిత సంఘాల అభ్యున్నతికి ఎంతో సహాయ సహకారాలు అందిస్తూ కుల సంఘాలను ఎకం చేసిన లక్కం నారాయణను బహుజన సాహిత్య అకాడమీగుర్తించి అక్టోబర్ 06వ తేదీన ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతిలో జరిగిన సౌత్ ఇండియా బహుజన రైటర్స్ 8వ నేషనల్ కాన్ఫరెన్స్ లో బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షులు నల్లా రాధాకృష్ణ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ యు సుబ్రమనియ న్ చేతులమీదుగా అవార్డును అందుకున్నారు ఈ సందర్బంగా నల్లా రాధాకృష్ణ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ల సాహిత్యాన్ని ముందుకు తీసుకు పోవడం కోసం బహుజన సాహిత్య అకాడమీ వారు ప్రతి సంవత్సరం ప్రజా ఉద్యమ కారులకు కవులకు రచయితలకు స్వచ్చంద సంస్థలకు ఈ అవార్డును అందజేస్తున్నట్లు తెలియజేసారు ఈ అవార్డుకు సహకరించిన దళిత నాయకులు అడ్కాపురం చంద్రమౌళి కి లక్కం నారాయణ, K. ప్రసాద్ , కృతజ్ఞతలు తెలిపారు

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :