ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / మంథని : తెలంగాణ రాష్టంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులు, ప్రజలు చుక్కలు చూపిస్తున్నారు. ప్రజాపాలన పేరుతో రైతుల భూములను కాంగ్రస్ ప్రభుత్వం గుంజుకోవటానికి ప్రయత్నం చేస్తుందని కొంత మంది రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుతానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే రైతులు తమ భూములు ఇచ్చేది లేదని నిరసన తెలపగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా కొడంగల్ లోరైతులు ఆందోళన చేసిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఏది ఇలా ఉండగా మంత్రి శ్రీధర్ బాబు నియోజకవర్గానికి సంబంధించి రైతులు గ్రామా దేవత మీద చేసిన తీర్మానం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. రామగిరి మండలం రత్నాపూర్ గ్రామపంచాయతీ పరిధి రామగిరి జిల్లా మేడిపల్లి శివారులోని భూములను ఇండస్ట్రియల్ పార్కు ఇవ్వలేమని రైతులు తేల్చి చెప్పారు. ఈ మేరకు రత్నాపూర్ గ్రామంలో శుక్రవారం రైతులు సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. 2008వ సంవత్సరంలో 150 ఎకరాల భూమి ప్రభుత్వం తీసుకుందని, మరల 250 ఎకరాలు తీసుకోవడానికి నిర్ణయించిందని దీనిని రైతులందరూ వ్యతిరేకిస్తున్నామని వారు తెలిపారు. ఇప్పటికే మా భూముల నుండి రైల్వే లైన్,గ్యాస్ పైప్ లైన్, పెద్ద టవర్ల లైన్, ఎల్లంపల్లి పైప్ లైన్ పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ భూములు కూడా పోతే మాకు తినడానికి తిండి కూడా కరువవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పటికీ ఇదే ఒక గ్రామాన్ని ఎందుకు ఎంచుకుంటున్నారని మండల బిజెపీ అధ్యక్షులు కొండు లక్ష్మణ్, గ్రామ టిఆర్ఎస్ అధ్యక్షుడు బాద్రాపు ప్రశాంత్ ఆరోపించారు. ఈ గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసినప్పుడే మా భూములపై కన్ను వేశారని అర్థమైందని వారన్నారు. ఏది ఏమైనా రైతుల భూములు గుంజుకుంటే ఊరుకోమని హెచ్చరించారు. గ్రామ సభ ఏర్పాటు చేయకుండా భూములకు అధికారులు తీర్మానం చేస్తే కోర్టుకు వెళ్తామని హెచ్చరించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్న సందర్భంలో భూములు తీసుకుంటున్నట్టు పబ్లికేషన్ ఎలా చేశారని అధికారులను ప్రశ్నించారు. ఈ సందర్భంగా గ్రామ దేవత అయిన బొడ్రాయి విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. తదనంతరం రామగిరి తాహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ పి.సుమన్ కు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పల్లె ప్రతిమా పివి రావు, మాజీ ఎంపీటీసీ ధర్ముల రాజసంపత్, మాజీ వార్డు సభ్యులు కొవ్వూరి సురేష్, బొంగురాల రవి, గెల్లుచేమంతి కృష్ణ, రైతు నాయకులు బర్ల వెంకన్న, భద్రపు కృష్ణమూర్తి,కొప్పుల రవీందర్ రావు, మండల శంకర్, దాసరి మల్లన్న, జక్కుల సది, సాగర్ల తిరుపతి, మండలి శీను, ఎరుకలి బక్కయ్య,మెడగొండ మధుకర్,ఖండే కొమురయ్య, ఖండే ఓదేలు, తోగరుశ్రీహరి స్వామి,శ్రీనివాస్,జక్కుల శివ, నార్ల వినోద్,బెజ్జల చిన్న రమేష్,కొవ్వూరి బక్కయ్య, తదితరులు పాల్గొన్నారు.
Reporter
Aakanksha News