Tuesday, 28 July 2026 03:54:55 AM

రైతు సంఘాల నాయకులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలి...సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు..

కేంద్ర బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి ప్రత్యేక నిధులు కేటాయించాలి...

Date : 28 March 2025 03:35 PM Views : 500

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : పంజాబ్ రాష్ట్రంలో రైతు సంఘాల నాయకులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని, పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలని సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపులో భాగంగా పెద్దపల్లి కలెక్టర్ కార్యాలయం ముందు రైతు సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు.అనంతరం జిల్లా కలెక్టర్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్బంగా పలువురు రైతు సంఘం నాయకులు మాట్లాడుతూ... కేంద్రంలోని మోడీ సర్కార్ ఇప్పటికైనా రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలనీ అన్నారు.పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా నిర్భందించిన రైతు సంఘాల నాయకులను, రైతులను భేషరుతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ సంస్థలకు లాభాలు చేకూర్చే చట్టాలను తక్షణమే రద్దు చేయాలన్నారు.గోడౌన్ లు, మార్కెట్ లు ప్రైవేట్ సంస్థలకు అప్పాజెప్పడం అంటేనే రైతంగాన్ని మోసం చేయడమేనని అన్నారు. అలాగే MSP కి చట్టభద్దత కల్పించాలని, వ్యవసాయ రంగం అభివృద్ధికి కేంద్ర బడ్జెట్ లో అధిక నిధులు కేటాయించాలని, వ్యవసాయ పరిశోధన శాలలను పెంచాలని అన్నారు. రైతంగాన్ని మోసం చేసే కల్తీ విత్తనాల, పురుగుల మందుల సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతు కూలి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెళ్తురు సదానందం, AIUKS జిల్లా అధ్యక్షులు గుమ్మడి వెంకన్న, రైతు సామస్యల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు ముడిమడుగుల మల్లన్న AIKMS రాష్ట్ర సహాయ కార్యదర్శి L. బీమన్నా, AIKMS జిల్లా అధ్యక్షులు మెర్గు చంద్రయ్య, రైతు సంఘం జిల్లా కన్వీనర్ తాండ్ర సదానందం, తెలంగాణ ప్రజా ఫ్రంట్ (TPF) పెద్దపల్లి జిల్లా కన్వీనర్ గుమ్మడి కొమురయ్య, CPIML న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి కె. విశ్వనాథ్, CPIML మాస్ లైన్ జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్, AIFTU రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ టి. రత్నకుమార్, AIKMS జిల్లా కార్యదర్శి కొల్లూరి మల్లేష్, మాస్ లైన్ జిల్లా నాయకులు గొల్లపల్లి చంద్రన్న, టి. రామన్న, బరపాటి మల్లన్న, కె. రాయమల్లు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :