ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : రామగిరి మండలం ముస్త్యాల గ్రామంలో సర్పంచ్ పదవికి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న నడిపెల్లి రాజేశ్వరరావు ఇంటింటి ప్రచారంలో వేడి పెరుగుతోంది. ప్రజల ఆశీర్వాదం తమపై ఉన్నదని, గెలిచిన యెడల గ్రామాభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తానని ఆయన స్పష్టం చేశారు.గ్రామంలోని ప్రతీ వీధి, ప్రతి ఇల్లును సందర్శిస్తూ రాజేశ్వరరావు ప్రజలను పలకరించిన తీరు ఓటర్లను ఆకట్టుకుంది. "ప్రజలే నా బలం… ప్రజలే నా ఆశ్రయం. మీ ఆశీర్వాదం నాతో ఉంటే ఏ పన్నాగం నా విజయాన్ని అడ్డుకోలేడు" అని ఆయన గ్రామస్తులతో మాట్లాడారు. ప్రచారంలో భాగంగా గ్రామస్తులు మహిళలు, యువత, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. గ్రామ సమస్యలను తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి కట్టుబడి ఉంటానని రాజేశ్వరరావు హామీ ఇచ్చారు.తన నామినేషన్ వేసిన తర్వాత ఆయన ప్రచారానికి వేగం పెంచి, గ్రామంలోని ప్రతి కుటుంబాన్ని కలిసి తమ అభిప్రాయాలను తెలుసుకోవడం, అభివృద్ధి ప్రణాళికలను వివరించడం కొనసాగించారు. ముస్త్యాలలో రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్ సదుపాయాలు, యువతకు ఉపాధి అవకాశాలు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు.పోరాట పటిమ కలిగిన నాయకుడిగా, అందరితో కలిసిమెలిసి పనిచేసే వ్యక్తిగా రాజేశ్వరరావుపై గ్రామస్తులలో విశ్వాసం వ్యక్తమవుతోంది. “ముస్త్యాలకు మరింత అభివృద్ధిని తీసుకురావాలంటే రాజేశ్వరరావును గెలిపించాలి” అని గ్రామ పెద్దలు పేర్కొన్నారు. ప్రచారంలో మహిళలు అధికంగా పాల్గొనడం విశేషం. వారి సమస్యలు తెలుసుకుని ప్రత్యేక పథకాలు అమలు చేసే విషయంలో ప్రాధాన్యం ఇస్తానని అభ్యర్థి హామీ ఇచ్చారు.సర్పంచ్ అభ్యర్థి రాజేశ్వరరావుకు గ్రామంలో ప్రజానీకం నుండి లభిస్తున్న ఆదరణ ఎన్నికల వేడిని మరింతగా పెంచుతోంది. ముస్త్యాల గ్రామ సర్పంచ్ పదవికి జరుగుతున్న పోటీలో తనదైన ముద్ర వేసే వ్యక్తిగా రాజేశ్వరరావు నిలుస్తున్నారని కాంగ్రెస్ వర్గాలు నమ్ముతున్నాయి.గ్రామంలో శాంతి–సమగ్రతతో పాటు సర్వాంగాభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని స్పష్టం చేసిన నడిపెల్లి రాజేశ్వరరావు ఎన్నికల ప్రచారాన్ని మరింత బలపరుస్తూ ముందుకు సాగుతున్నారు.
Admin
Aakanksha News