Wednesday, 29 July 2026 11:11:59 AM

రోడ్డు ప్రమాదంలో ఎన్టీపీసీ కార్మికుడు మృతి...

Date : 28 November 2025 11:26 AM Views : 937

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : పెద్దపల్లి జిల్లా అందుగులపల్లి సమీపంలో శుక్రవారం చోటు చేసుకున్న సంఘటన స్థానికులను తీవ్ర విషాదంలో ముంచేసింది. అందుగులపల్లి గ్రామానికి చెందిన పిడుగు గోపాల్ (38) ఎన్టీపీసీలో కార్మికుడిగా పని చేస్తూ కుటుంబాన్ని సాగిస్తున్నాడు. ప్రతిరోజు మాదిరిగానే విధులకు వెళ్లడానికి ద్విచక్రవాహనంపై బయలుదేరిన గోపాల్ బైక్‌ను వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో గోపాల్ బైక్‌పై నుండి ఎగిరిపడి రోడ్డుపై పడగా తలపై తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటనను చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.పెద్దపల్లి రూరల్ ఎస్సై మల్లేష్ తన సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకుని ప్రమాద స్థలాన్ని పరిశీలించారు.అనంతరం మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై మల్లేష్ తెలిపారు. గోపాల్ ఆకస్మిక మరణంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తీవ్రంగా విలపిస్తున్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :