Sunday, 26 April 2026 06:00:18 PM

గుండెపోటుతో వెల్ఫేర్ ఆఫీసర్ మృతి...

Date : 26 March 2025 06:01 PM Views : 382

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / యైటింక్లెయిన్ కాలనీ (గోదావరిఖని) : సింగరేణి సంస్థ రామగుండం రీజియన్-2 డివిజన్ పరిధిలోని ఓసిపి-3లో వెల్ఫేర్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్న రాజు బుధవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు.తెల్లవారుజామున 3గంటలకు ఛాతీలో నొప్పివస్తుందని అస్వస్థతకు గురి కావడంతో అంబులెన్స్ లో డిస్పెన్సరికి తరలించారు.డాక్టర్స్ పరిశీలించగా అప్పటికే రాజు మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా ఓసిపి-3 సంక్షేమాధికారి ఆకస్మిక మరణంతో ఓసిపి-3 ప్రాజెక్టులో విషాదఛాయలు నెలకొన్నాయి. సింగరేణి ప్రాతినిధ్య కార్మిక సంఘం ఐ.ఎన్.టి.యు.సి అర్జీ-2 ఏరియా వైస్ ప్రెసిడెంట్ బదావత్ శంకర్ నాయక్, సి.ఐ.టి.యు ఏరియా సెక్రటరీ కుంట ప్రవీణ్ కుమార్ శ్రదంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :