Tuesday, 28 July 2026 06:27:06 AM

కార్మికుల సంక్షేమం కొరకు INTUC ఎల్లవేళలా అండగా ఉంటుంది...

జీడీకే OCP-5 గేట్ మీటింగ్ లో INTUC సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నరసింహారెడ్డి

Date : 20 September 2024 02:05 PM Views : 377

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : కార్మికుల సంక్షేమం కోసం INTUC ఎల్లవేళలా అండగా ఉంటుందని సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నరసింహారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా జీడీకే OCP-5 లో జరిగిన గేట్ మీటింగ్ లో ఆయన మాట్లాడుతూ....రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో జనక్ ప్రసాద్ అండదండలతో కార్మికుల సొంత ఇంటి కల నెరవేరుస్తామని, కార్మికునికి సంబంధించిన పెర్క్స్ పై విధించే ఇన్కమ్ టాక్స్ రద్దు చేయిస్తామని తెలిపారు. అలాగే సింగరేణికి ఈ సంవత్సరం వచ్చిన లాభాలలో వాటాను కార్మికులకు త్వరలో అందజేపిస్తామన్నారు. RG1 ఉపాధ్యక్షులు, K.సదానందం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రెటరీ లక్ష్మీపతి గౌడ్, జిల్లా అధ్యక్షులు వడ్డేపల్లి దాసు, ఫిట్ సెక్రటరీ L. ఆంజనేయులు, సెంట్రల్ డిప్యూటీ జనరల్ సెక్రెటరీ గడ్డం కృష్ణ, మైనింగ్ స్టాప్ ఇంచార్జ్ పోతర వేన సమ్మయ్య, సెంట్రల్ నాయకులు బేబీ శ్రీనివాస్, గండ్ర దామోదర్ రావు, మండ రమేష్, బ్రాంచ్ సెక్రటరీలు నీరటి సాగర్, బూర జగన్ , ఎదులాపురం శ్రీనివాస్, ఆర్ డి చారి , తాటికొండ అంజయ్య, చిందం శ్రీనివాస్, కోర శ్రీనివాస్, కే సమ్మయ్య, నరసయ్య ఫోర్ మెన్ ,సుధాకర్ రెడ్డి ,బద్రి శంకర్, కూసనపల్లి శంకర్, నరసయ్య , సంపత్ , తాటి రాజయ్య, వెంకటేశ్వర్లు, తాళ్ల కుమార్, పాల్, అశోక్ ,తిరుపతి, మధు, దశరథం, లింగయ్య ,కె వెంకటస్వామి, ఇతర గనుల పిట్ సెక్రటరీ లు సిరిపురం నరసయ్య ,గాదె సంపత్, గణపతి దామోదర్, యాసిన్, నయీమ్, తదితర నాయకులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :