ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఎల్లవేళలా కార్మిక సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తుందని టీబీజీకేఎస్ ఉపాధ్యక్షులు ఆయిల్ శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా వకీల్ పల్లి గనిని సందర్శించి కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం అయన మాట్లాడుతూ..గత సంవత్సరం 18 నెలల కాలంలో యాజమాన్యం అవసరం నిమిత్తం సర్ఫేస్ లో విధులు కేటాయించిన కార్మికులకు అండర్ గ్రౌండ్ అలవెన్స్ కట్ చేయడం వల్ల తీవ్రమైన ఆర్థిక నష్టం జరిగిందని పేర్కొన్నారు. 190 మాస్టర్లు నిండక బదిలీ వర్కర్లు జనరల్ మజ్దూర్ ప్రమోషన్ పొందే అర్హత కోల్పోయే పరిస్థితిలు ఏర్పడ్డాయని వివిధ అనారోగ్య కారణాల వల్ల సీనియర్ కార్మికులు అవసరం నిమిత్తం సర్ఫేస్ పనిలో యాజమాన్యం కేటాయిస్తే ఒక యూనియన్ సంబంధించిన నాయకులు వారిని ఇబ్బంది పెట్టడం శోచనీయమని తెలిపారు. కార్మిక సంఘాలు కార్మికుల సౌకర్యాల గురించి పాటుపడాలి కానీ కార్మికులను ఇబ్బందులుగా గురి చేసే విధంగా చర్యలు తీసుకోవడం మానుకోవాలని సూచించారు. సర్ఫేస్ లో ఏర్పడిన టెక్నీషియన్స్ ఖాళీలను వెంటనే పూరించాలని, మెడికల్ గ్రౌండ్ కింద ఉన్న జనరల్ మద్దూర్ ఖాళీలను సీనియారిటీ కోటాలో భక్తి చేయాలని యాజమాన్యానికి విజ్ఞప్తి చేయనున్నట్టు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్, రాములు, కూర తిరుపతి, శ్రీనివాస్ ,లెనిన్, రాజారాం, శ్రీనివాస్ ,సురేందర్, శ్రీకాంత్, రంజిత్ ,నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు
Admin
Aakanksha News